Gold price today 14 November : గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు!-gold price today 14th november 2023 check latest rates in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today 14 November : గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు!

Gold price today 14 November : గుడ్​ న్యూస్​.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు!

Sharath Chitturi HT Telugu
Nov 14, 2023 05:47 AM IST

Gold price today 14 November : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Chandrakant Paddhane)

Gold price today 14 November : దేశంలో బంగారం ధరలు మంగళవారం మరింత తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 90 దిగొచ్చి.. రూ. 55,450కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 55,540గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 900 తగ్గి, రూ. 5,54,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,545గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 60,490కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,590గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1000 దిగొచ్చి.. రూ. 6,04,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,049గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,490గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,900గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,980గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,450గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,490గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,450గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,500గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,540గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,450గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,240గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 600 దిగొచ్చి.. రూ. 72,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 73,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,400.. బెంగళూరులో రూ. 71,750గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం