Gold Rate Today: బంగారం ధరల పెరుగుదలకు కాస్త విరామం వచ్చింది. ఇటీవలి కాలంలో అమాంతం ఎగిసిన రేట్లు రెండు రోజుల నుంచి స్తబ్ధుగా ఉన్నాయి. దేశంలో నేడు (జనవరి 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 వద్ద ఉంది. క్రితం రోజు ధర వద్దే కొనసాగింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ.220 తగ్గి రూ.56,730కు చేరింది. వెండి కూడా నేడు స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..,హైదరాబాద్‍లో..Gold Rate Today: హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర నేడు రూ.52,000 వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,730గా ఉంది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.,ఇతర సిటీల్లో..Gold Rate Today: ఢిల్లీలో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 గ్రాములకు చెందిన తులం గోల్డ్ రేటు ఆ నగరంలో రూ.52,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890కు చేరింది. ముంబై, కోల్‍కతాలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వెల రూ.56,730గా ఉంది.,Gold Rate Today: అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050కు చేరింది. 24 గ్రాముల 10 గ్రాముల రేటు రూ.56,780గా ఉంది. చెన్నైలో 22 గ్రాముల తులం బంగారం ధర రూ.52,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,790కు చేరింది.,అంతర్జాతీయ మార్కెట్‍లో..అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు ‘స్పాట్ గోల్డ్’ రేటు 1,909.46 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 23.4 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.,వెండి కూడా స్థిరంSilver Price Today: దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగింది. నేడు కిలో వెండి ధర రూ.72,200గా ఉంది. 10 గ్రాముల సిల్వర్ రేటు రూ.722గా ఉంది.,హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలో నేడు కిలో వెండి ధర రూ.74,800గా ఉంది. కోల్‍కతా, ఢిల్లీ, ముంబై సిటీల్లో కిలో వెండి ధర రూ.72,200గా ఉంది.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)