Gold price Hike: పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. నానాటికీ బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు రోజుల్లో బంగారం రేట్లు ఏకంగా రూ.2వేలకుపైగా పెరిగాయి. నేడు (మార్చి 19) స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.55,300గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.60,320కు చేరింది. దీంతో బంగారం ధరలు ఆల్‍టైమ్ గరిష్టానికి చేరి కొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ధరలు కూడా పైపైకి వెళుతున్నాయి. బంగారం ధర ఇంతలా పెరిగేందుకు కారణాలేంటి.. హైదరాబాద్ సహా నేడు దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.,కారణాలివే..Gold Price Hike: అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాగే స్విట్జర్లాండ్‍లో బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూస్ కూడా నష్టాల్లోకి వెళ్లటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో మదుపరులు క్రమంగా బంగారంపై పెట్టుబడులను పెంచుకుంటున్నారు. విపరీతంగా గోల్డ్ కొంటున్నారు. దీనివల్ల పసిడికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మదుపరులు ఇప్పటికైతే దానివైపే మొగ్గుచూపున్నారు. దీంతో డిమాండ్ గరిష్టానికి చేరింది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2,000 డాలర్లకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు ఏకంగా 3 శాతానికి పైగా పెరిగి.. 1,988 డాలర్ల వద్దకు చేరింది. సుమారు ఐదు రోజుల నుంచి ప్రపంచ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ పైపైకి వెళుతోంది. దీంతో భారత్‍లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. బ్యాంకింగ్ సంక్షోభం కొలిక్కి వచ్చే వరకు పసిడి ధరల్లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.,హైదరాబాద్ సహా వివిధ సిటీల్లో..Gold Price in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల (తులం) ధర నేడు రూ.55,300గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి రేటు రూ.60,320గా ఉంది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు ముంబై, కోల్‍కతాలోనూ ఇవే ధరలు ఉన్నాయి.,Gold Price Hike: ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,470గా ఉంది. బెంగళూరు, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు రూ.55,350కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,370కు చేరింది.,వెండి ధరలుSilver Prices: దేశంలో వెండి ధర ఆదివారం స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.72,100గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడలో కిలో వెండి రేటు రూ.74,400గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్‍లో కిలో సిల్వర్ రేటు రూ.72,100 వద్ద కొనసాగింది.