Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా!
Gold Price Today: దేశీయ మార్కెట్‍లో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. వెండి రేటు కూడా తగ్గింది. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర దేశంలో తగ్గింది. గత 24 గంటల్లో గోల్డ్ రేట్లు స్పల్పంగా దిగొచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.100 తగ్గి బుధవారం ఉదయానికి రూ.55,450కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.110 క్షీణించి రూ.60,490కు చేరింది. దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా కిందికి వచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,600కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.60,630కు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) పసిడి రేటు రూ.55,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,490కు దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వివిధ ప్రధాన సిటీల్లో..
కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,500గా ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల రేటు రూ.60,530కు చేరింది. అహ్మదాాబాద్‍లోనూ ఇదే ధర ఉంది.
ముంబై, కోల్‍కతా సిటీల్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.55,450కు దిగొచ్చింది. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.60,490కు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,850, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,920గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‍లో మాత్రం గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,957 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం గరిష్ట రుణ పరిమితి చర్చలు కొలిక్కి వస్తుండటంతో ఇటీవల గోల్డ్ రేట్లు దిగివస్తున్నాయి. ద్రవ్యోల్బణం, డిమాండ్‍లో మార్పులు బంగారం రేట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
వెండి కూడా డౌన్
దేశంలో వెండి ధర కూడా తగ్గింది. 24 గంటల వ్యవధిలో కిలో వెండి రేటు రూ.400 తగ్గి రూ.72,600కు దిగొచ్చింది. కాగా, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై సిటీల్లో కిలో వెండి ధర రూ.76,500కు చేరింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్ సిటీల్లో కిలో వెండి రేటు రూ.72,600గా ఉంది.