Gold and Silver rates today : తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే-gold and silver rates today 7 january 2023 check latest prices in telugu states hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 7 January 2023 Check Latest Prices In Telugu States Hyderabad

Gold and Silver rates today : తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 07, 2023 06:22 AM IST

Gold and Silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 దిగొచ్చి.. రూ. 50,900కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 51,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4000 తగ్గి, రూ. 5,09,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,090గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 430 తగ్గి.. రూ. 55,530కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 55,960గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4300 దిగొచ్చి.. రూ. 5,55,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,553గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,050గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,680గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 55,580గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,900గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,620గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 50,900గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 55,530గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,900గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,530గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,950గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 55,580గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 50,900గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,530గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,100గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1000 తగ్గి.. రూ. 71,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 72,000గా ఉండేది.

Silver rate in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 73,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 71,000.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 410 తగ్గి.. రూ 28,130కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,540గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,130గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం