Gold and silver rates today : పసిడి భగభగ! రూ. 58వేలు తాకిన బంగారం ధర- భారీగా పెరిగిన వెండి
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 750 పెరిగి.. రూ. 58,100కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 57,350గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7,500 పెరిగి, రూ. 5,81,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,810గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 820 వృద్ధి చెంది.. రూ. 63,280కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,560గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,200 పెరిగి.. రూ. 6,33,800గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,530గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,040గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,380గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,430గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా ఉంది.
ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,920గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 79,200కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 78,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 82,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 79,200.. బెంగళూరులో రూ. 78,000గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం