Gold and silver rates today : రూ. 58వేలు దాటిన పసిడి- భారీగా పెరిగిన వెండి ధర!-gold and silver rates today 3 december 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 3 December 2023

Gold and silver rates today : రూ. 58వేలు దాటిన పసిడి- భారీగా పెరిగిన వెండి ధర!

Sharath Chitturi HT Telugu
Dec 03, 2023 05:46 AM IST

Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు అతి భారీగా పెరిగాయి.

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం కూడా భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 750 పెరిగి.. రూ. 58,450కి చేరింది. శనివారం ఈ ధర రూ. 57,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.7500 పెరిగి, రూ. 5,84,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,845గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 810 వృద్ధి చెంది.. రూ. 63,760కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,100 పెరిగి.. రూ. 6,37,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,910గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,760గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,530గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58,450గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,760గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,450గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,500గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,810గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,450గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,050గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 80,500కి చేరింది. శనివారం ఈ ధర రూ. 79,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 83,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 80,500.. బెంగళూరులో రూ. 79,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం