Gold and silver rates today : రూ. 57,500కు చేరువలో పసిడి ధర- భారీగా పెరిగిన వెండి రేట్లు!-gold and silver rates today 28th november 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 28th November 2023

Gold and silver rates today : రూ. 57,500కు చేరువలో పసిడి ధర- భారీగా పెరిగిన వెండి రేట్లు!

Sharath Chitturi HT Telugu
Nov 28, 2023 05:37 AM IST

Gold and silver rates today : దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధరలు స్వల్పంగా వృద్ధిచెందాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 57,350కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 57,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2500 పెరిగి, రూ. 5,73,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,735గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 270 వృద్ధి చెంది.. రూ. 62,560కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,290గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2700 పెరిగి.. రూ. 6,25,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,500గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,560గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,560గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,560గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,350గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,400గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,610గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,350గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధ, వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,850గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,300 పెరిగి రూ. 78,500కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 77,200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,500.. బెంగళూరులో రూ. 76,250గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం