Gold and silver rates today : రూ. 57వేలు తాకిన పసిడ ధర.. భారీగా పెరిగిన వెండి రేటు!-gold and silver rates today 26th november 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 26th November 2023

Gold and silver rates today : రూ. 57వేలు తాకిన పసిడ ధర.. భారీగా పెరిగిన వెండి రేటు!

Sharath Chitturi HT Telugu
Nov 26, 2023 09:14 AM IST

Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా వృద్ధి చెందాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Sanjay Sharma)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 57,100కి చేరింది. శనివారం ఈ ధర రూ. 56,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 5,71,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,710గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 320 వృద్ధి చెంది.. రూ. 62,290కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,970గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3,200 పెరిగి.. రూ. 6,22,900గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,440గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,290గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,550గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,290గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,340గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా ఉంది.

ఇజ్రయెల్​ పాలస్తీనా యుద్ధం, దేశంలో గొల్డ్​కి ఉన్న డిమాండ్​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,720గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 77,200కి చేరింది. శనివారం ఈ ధర రూ. 76,200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,200.. బెంగళూరులో రూ. 76,250గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 460 వృద్ధి చెంది.. రూ 24,940కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,480గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,940గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం