Gold and silver rates today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా!-gold and silver rates today 20th november 2023 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా!

Gold and silver rates today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా!

Sharath Chitturi HT Telugu

Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా! (Sanjay Sharma)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,550గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,65,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,655గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 61,690గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,16,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,169గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,690గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,00గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,690గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,690గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,740గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,690గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 76,000గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,000.. బెంగళూరులో రూ. 75,250గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 700 పెరిగి.. రూ 24,150కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,080గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,150గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం