Gold and Silver rates today : మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేటి లెక్కలివే-gold and silver rates today 13 january 2023 check latest price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 13 January 2023 Check Latest Price In Hyderabad

Gold and Silver rates today : మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేటి లెక్కలివే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 13, 2023 06:14 AM IST

Gold and Silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 51,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 51,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పెరిగి, రూ. 5,14,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,140గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 వృద్ధి చెంది.. రూ. 56,070కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 55,960గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 పెరిగి.. రూ. 5,60,700గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,220గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 56,070గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,360గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,120గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 51,400గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,070గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,070గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,450గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,120గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 51,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,070గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,190గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 400 పెరిగి.. రూ. 71,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 71,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 71,900.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ.180 తగ్గి. రూ. 28,000కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 28,180గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం