Gold rate today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..-gold and silver rate today on 02 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..

Gold rate today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
May 02, 2024 01:02 PM IST

Gold rate today: గత కొన్ని రోజులుగా కొంత తగ్గుముఖం పట్టిన పసిడి ధర గురువారం భారీగా పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 66, 250 కి చేరింది. మీ నగరంలో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ చూడండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం మళ్లీ భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 700 పెరిగి.. రూ. 66,250 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 65,550 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 7000 పెరిగి, రూ. 6,62,500 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,625 గా ఉంది.

మళ్లీ పెరిగిన పసిడి ధర

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 760 పెరిగి.. రూ. 72,270 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,510 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7600 పెరిగి.. రూ. 7,22,700 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,227 గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,400 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,420 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,270గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,150 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,250 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,270 గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,250 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,320 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా గురువారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 50 పెరిగి, రూ. 8,350గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 పెరిగి.. రూ. 83,500 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 83,000 గా ఉండేది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. రూ. 87,000 గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 86, 600 గా ఉంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,500.. బెంగళూరులో రూ. 82,250గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel