Gold rate today: మీ నగరంలో నేడు బంగారం, వెండి ధరల వివరాలు..-gold and silver rate today on 01 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: మీ నగరంలో నేడు బంగారం, వెండి ధరల వివరాలు..

Gold rate today: మీ నగరంలో నేడు బంగారం, వెండి ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
May 01, 2024 09:27 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

ఈ రోజు బంగారం ధర
ఈ రోజు బంగారం ధర

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,540కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,550గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,65,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,654గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,590కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,600 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,25,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,259గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,740గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,540 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,590గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,510 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,650 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,540గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,590 గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,540 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,590 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,640 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,540గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా బుధవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 50 తగ్గి, రూ. 8,340గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 దిగొచ్చి.. రూ. 83,400 కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 83,900 గా ఉండేది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 86,900 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 87, 400 గా ఉంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,400.. బెంగళూరులో రూ. 83,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel