Gold and silver rate today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలివే..!-gold and silver rate today 19th september 2023 ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Gold And Silver Rate Today 19th September 2023

Gold and silver rate today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలివే..!

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Nitin Lawate)

Gold and silver rate today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు పడ్డాయి. ఆ వివరాలు..

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 140 పెరిగి.. రూ. 55,050కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 54,910గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1400 పెరిగి, రూ. 5,50,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,505గా కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 150 వృద్ధి చెంది.. రూ. 60,050కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,900గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1500 పెరిగి.. రూ. 6,00,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,200గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,400గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,050గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,050గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,050గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది.

వెండి ధర..

దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,450గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 200 దిగొచ్చి.. రూ. 74,500గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 74,700గా ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,700.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 పెరిగి రూ. 24,840కి చేరింది. క్రితం రోజు రూ. 24,760గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,840గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం