Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు..-gold and silver prices today on 29 11 2023 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 29-11-2023 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు..

HT Telugu Desk HT Telugu
Nov 29, 2023 10:14 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,350 గా ఉంది. మంగళవారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,73,500 గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,735గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 62,560 గా ఉంది. అలాగే, 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,25,600 గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,500 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,710 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,560 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050 గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,350 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,560 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,350 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,400 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,610 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,350గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం, వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,850 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 78,500 కి చేరింది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,500.. బెంగళూరులో రూ. 78,000 గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel