Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 28 02 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 28-02-2024 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
Feb 28, 2024 09:09 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు ఈ రోజు కూడా తగ్గాయి. వెండి ధరలు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,590కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 57,600గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,75,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,759గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 62,830 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,840 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,28,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,283గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,740 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,990 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,830 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,160గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,450గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,590 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,830 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,590 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,880 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,390 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 73,900 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 74,000 గా ఉండేది.

Silver rates today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,900.. బెంగళూరులో రూ. 71,400 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 160 పెరిగి.. రూ. 23,630 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,470 గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 23,630 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel