Gold and silver prices Today: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27న బంగారం ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 27 03 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 27-03-2024 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27న బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 09:34 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver price today : మార్చ్​ 27న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర బుధవారం ఎంత ఉంది? విజయవాడ, వైజాగ్​, నెల్లూరు​లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి రూ. 61,140 చేరుకుంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి 66,700 కి చేరింది. కేజీ వెండి ధర రూ. 77,400గా ఉంది.

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 61,140గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 66,700గా ఉంది. కేజీ వెండి ధర రూ. 80,400గా ఉంది.

Gold price today in Hyderabad : ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,140ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,700గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,040 గా ఉంది.

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 61,140- రూ. 66,700 గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,040గాను.. కేజీ వెండి రేటు రూ. 80,400గాను కొనసాగుతున్నాయి.

Vijayawada gold price : తిరుపతి, నెల్లూరు, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక దేశ రాజధాని దిల్లీలో వెండి ధర రూ. 77,400గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్​ గోల్డ్​ ధర రూ. 61,290.. 10 గ్రాముల 24 క్యారెట్​ గోల్డ్​ ధర రూ. 66,850గా ఉంది. అదే సమయంలో బెంగళూరులో గోల్డ్​ ధరలు వరుసగా.. రూ. 61,140- రూ. 66,700గా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76,600 గా కొనసాగుతోంది.

మరోవైపు.. చెన్నైలో నేటి బంగారం ధరలు వరుసగా.. రూ. 61,990- రూ. 67,630గా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ. 80,400గా ఉంది.

(గమనిక:- పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.)

WhatsApp channel