Gold and silver prices today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 25 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Gold and silver prices today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
May 25, 2024 09:48 AM IST

Gold and silver prices today : దేశంలో శనివారం పసిడి, వెండి ధరలు తగ్గినవి. భారత్ లోని వివిధ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలు
ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలు

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు శనివారం తగ్గినవి. వెండి ధరలో పెద్దగా మార్పు లేదు. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధర

Gold and silver prices today : దేశంలో బంగారం (gold rate) ధరలు శనివారం తగ్గినవి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 900 దిగొచ్చి.. రూ. 66,390 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,290 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 9000 తగ్గి, రూ. 6,63,900 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,639గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 980 తగ్గి రూ. 72,430 కి చేరింది. శుక్రవారం ఈ ధర 73,410 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,24,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,243 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,540 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,580గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,390 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,430గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర (gold rate)రూ. 66,490 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,540గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,390గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,430 గాను ఉంది.

హైదరాబాద్​లో పసిడి ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,390గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,430 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,440గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,480గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,390గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,430 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today in Hyderabad : దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గినవి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,190 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 91,900 కి చేరింది. ఇప్పుడు హైదరాబాద్ లో 10 గ్రాములు వెండి ధర రూ. 9640 పలుకుతోంది. అంటే, కేజీ వెండి ధర రూ. 9,64,000 కి చేరుకుంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,900.. బెంగళూరులో రూ. 92,400గా ఉంది. కేరళ, పూణె, పట్నాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel