Gold price today: హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు..-gold and silver prices today on 19 06 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు..

Gold price today: హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 09:39 AM IST

Gold price today : దేశంలో పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

తగ్గిన బంగారం ధర
తగ్గిన బంగారం ధర

Gold price today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 66,190 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,290 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 6,61,900 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,619గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 110 తగ్గి.. రూ. 72,210 కి చేరింది. ఈ ధర మంగళవారం రూ. 72,320 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 7,22,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,221 గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,340గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,460గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,190 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,210 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,960గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,050 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,190గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,210గాను ఉంది.

హైదరాబాద్​లో గోల్డ్​ ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,190గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,210గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,260 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,190గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,210 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today : దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 70 పెరిగి రూ. 9160 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 9,090 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 700 పెరిగి.. రూ. 91,600 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 90,900గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 96,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,600.. బెంగళూరులో రూ. 90,900గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం తగ్గాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 26,120 గా ఉంది. ఈ ధర మంగళవారం రూ. 26,180 గా ఉంది. ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర(10గ్రాములు) రూ. 26,120 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel