Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,160 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 67,150 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,71,600 గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,716 గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 73,260 కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,32,600 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,326గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73410గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73260 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67260 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73370 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73260 గాను ఉంది.
హైదరాబాద్ లో బంగారం ధర
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67160గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73260 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67210గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73310గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73260గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
గురువారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,760 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 87,600 కి చేరింది.
Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.91100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 87,700.. బెంగళూరులో రూ. 86,600 గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)