Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 11 01 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 11-01-2024 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
Jan 11, 2024 09:22 AM IST

Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్లాటినం ధరలు భారీగా పడిపోయాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర గురువారం రూ. 57,700 గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,77,000 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,770 గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 62,950 గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,29,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,295 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ప్రధాన నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850 గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,200 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,730 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,950 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,700 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950 గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,660 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 76,600 గా ఉంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది.

Silver rate in Hyderabad కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,000.. బెంగళూరులో రూ. 73,500 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం కూడా భారీగా తగ్గాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 390 తగ్గి.. రూ 24,550 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,940 గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,550 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel