Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..-gold and silver prices today on 10 04 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..

Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
Apr 10, 2024 09:21 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ అవి ఆల్​టైమ్​ హైలోనే ఉన్నాయి. పూర్తి వివరాలు..

హైదరాబాద్ లో బంగారం ధర
హైదరాబాద్ లో బంగారం ధర

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ అవి ఆల్​-టైమ్​ హైలోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్​లో వెండి ధర రూ. 88 వేలు దాటింది. పూర్తి వివరాలు..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 110 పెరిగి.. రూ. 65,750కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 65,640 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 1100 పెరిగి, రూ. 6,57,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,575 గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 వృద్ధి చెంది.. రూ. 71,740 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,630 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 పెరిగి.. రూ. 7,17,400గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,950 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,890 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,760 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,770 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,760గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,740 గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధరలు

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,760గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,740 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,710 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,790గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,6760గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,740గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం కూడా స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,440గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84,400 కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 84,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 87,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,400.. బెంగళూరులో రూ. 83,9050గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 1220 పెరిగి రూ. 26,060 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 24,840గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 26,060గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel