Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 66,240-gold and silver prices today on 09 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 66,240

Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 66,240

HT Telugu Desk HT Telugu
May 09, 2024 09:19 AM IST

Gold price today : దేశంలో పసిడి, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్ లో బంగారం ధర
హైదరాబాద్ లో బంగారం ధర

Gold price today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,240 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,250గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,62,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,624 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 10 తగ్గింది. గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 గా ఉంది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,270 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,22,600 కి చేరింది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం చాలా స్వల్పంగా తగ్గినవి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,390 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,260 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధర

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,290 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,240 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,260 గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,310 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,240గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర..

దేశంలో వెండి ధరల్లో గురువారం పెద్దగా మార్పేమీ లేదు. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,490 గా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ. 84,900 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇది రూ. 85,000 గా ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,900.. బెంగళూరులో రూ. 84,200 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం కూడా భారీగా పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 350 పెరిగి రూ. 26,140కి చేరింది. క్రితం రోజు రూ. 25,790 గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర(10గ్రాములు) రూ. 26,140 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel