Gold price: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 06 03 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 06-03-2024 : Check Latest Rates In Your City

Gold price: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
Mar 06, 2024 09:13 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఆ వివరాలు..

మార్చి 6న వివిధ నగరాల్లో బంగారం ధరలు
మార్చి 6న వివిధ నగరాల్లో బంగారం ధరలు

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 59,460 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 59,450 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,94,600 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,946 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 64,860 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,48,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,486గా ఉంది.

చెన్నైలో బంగారం ధర

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 59,610గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,010 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 59,460 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 64,860 గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,160 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,630 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 59,460గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,860గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,460గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,860గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,510గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 64,910గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 59,460గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,860 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి రేటు..

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి, రూ. 74,800 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 74,700 గా ఉంది.

Silver rate in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 72,650గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 250 తగ్గి రూ. 23,450గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 23,700గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 23,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel