Gold and silver prices Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర; అదే బాటలో వెండి కూడా..-gold and silver prices today on 01 12 2023 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 01-12-2023 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర; అదే బాటలో వెండి కూడా..

HT Telugu Desk HT Telugu
Dec 01, 2023 10:38 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్ప మొత్తంలో పెరిగాయి. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 57,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,500 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 5,77,000 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,770 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 220 వృద్ధి చెంది.. రూ. 62,950 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,730 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 2200 పెరిగి.. రూ. 6,29,500 గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,820 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,000 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,700 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950 గా ఉంది.

ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,950 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 79,500 కి చేరింది. గురువారం ఈ ధర రూ. 79,200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 82,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 79,500.. బెంగళూరులో రూ. 78,500 గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel