Gold and Silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..-gold and silver prices today may 14 2024 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Gold and Silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu
May 14, 2024 05:39 AM IST

Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు మరింత పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Deepak Salvi )

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,140కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 67,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,71,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,714గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,240కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,250గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,32,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,324గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,370గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,240గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:- Stock market crash : స్టాక్​ మార్కెట్​ల పతనానికి ఐదు కారణాలు- ‘మోదీ రాకపోతే!’

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,240గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,350గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,240గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,240గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,270గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,140గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,240గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,640గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 86,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 86,500గా ఉండేది.

Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,400.. బెంగళూరులో రూ. 86,150గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం