Gold and silver prices today : గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!-gold and silver prices today march 1 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today March 1 2024 In Telugu States

Gold and silver prices today : గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!

Sharath Chitturi HT Telugu
Mar 01, 2024 05:31 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు దిగొస్తున్నాయి. వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,580కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,590గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,75,800కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,758గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 62,820కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,830గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,28,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,282గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,730గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,980గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,580 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,820గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,160గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,450గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,580గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,820గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,580గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,820గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,630గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,870గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,580గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,820గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,430గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 74,200కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,200గా ఉండేది.

Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,200.. బెంగళూరులో రూ. 71,850గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 180 తగ్గి.. రూ 23,450కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,630గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం