Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold and silver prices today in hyderabad 05 march 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today In Hyderabad 05 March 2024

Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Mar 05, 2024 05:49 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 58,740గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,874గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 64,080గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,40,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,408గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,230గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 64,080గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,680గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,080గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,080గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 64,130గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,080గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,350గా ఉంది. ఇక కేజీ వెండి రూ. రూ. 73,500గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,500.. బెంగళూరులో రూ. 72,850గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 తగ్గి రూ. 23,520గా ఉంది. సోమవారం ఈ ధర రూ. 23,570గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,520గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం