Gold and silver prices today : హైదరాబాద్​లో వెండి రేటు @88వేలు- పసిడి ధర ఎంతంటే..-gold and silver prices today 9 april 2024 in hyderabad and vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : హైదరాబాద్​లో వెండి రేటు @88వేలు- పసిడి ధర ఎంతంటే..

Gold and silver prices today : హైదరాబాద్​లో వెండి రేటు @88వేలు- పసిడి ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ అవి ఆల్​-టైమ్​ హైలోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్​లో వెండి ధర రూ. 88వేలు దాటింది. పూర్తి వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Imran Nissar)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 65,660కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 65,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,56,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,566గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 71,630కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,16,300గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,810గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,630గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,660గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,660గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,630గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,710గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,680గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,660గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,680గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 84,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 84,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,600.. బెంగళూరులో రూ. 82,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 40 పెరిగి రూ. 24,840కి చేరింది. క్రితం రోజు రూ. 24,800గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,840గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం