Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు ఇలా..-gold and silver prices today 8th april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు ఇలా..

Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పడ్డాయి. కానీ ఈ రెండు కూడా ఆల్​ టైమ్​ హైకి దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 65,340కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 65,350గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,53,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,534గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 71,280గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 71,290గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,12,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,128గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,490గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,430గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,340 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,280గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,340గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,280గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,340గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,280గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,390గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,330గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,340గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,280గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,340గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 83,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ 83,500గా ఉండేది.

Silver price today Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,400.. బెంగళూరులో రూ. 83,100గా ఉంది.

ఏది ఏమైనా.. దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​ టైమ్​ హైకి దగ్గర్లోనే ఉన్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం