Gold and silver prices today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 6th april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. అయినా.. పసిడి, వెండి ధరలు ఆల్​ టైమ్​ హై దగ్గర్లోనే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 64,140కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 64,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,41,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,414గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 69,970కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 69,890గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,99,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,997గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,120గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 69,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,010గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 64,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 69,970గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,970గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 70,020గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64,140గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,970గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,160గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 81,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 81,700గా ఉండేది.

Silver price in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 84,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 81,600.. బెంగళూరులో రూ. 81,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 500 తగ్గి.. రూ 24,620కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,120గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,620గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం