Gold and silver prices today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా..-gold and silver prices today 6 may 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Gold and silver prices today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu
May 06, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పడ్డాయి. మీ నగరాల్లో నేటి బంగారం, వెండి, ప్లాటీనం రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 65,840కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 65,850గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,58,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,584గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 71,820గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 71,830గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,18,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,182గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,990గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,970గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,840 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,820గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,990గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,840గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,820గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,840గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,820గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,890గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,870గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,840గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,820గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 82,900గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ 83,000గా ఉండేది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 82,900.. బెంగళూరులో రూ. 82,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 తగ్గి రూ. 25,450కి చేరింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం