Gold and silver prices today : భారీగా పడిన వెండి ధర- నేటి పసిడి రేటు ఎంతంటే..-gold and silver prices today 3 march 2024 in telugu states delhi chennai ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 3 March 2024 In Telugu States Delhi Chennai

Gold and silver prices today : భారీగా పడిన వెండి ధర- నేటి పసిడి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Mar 03, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేటు మాత్రం ఒక్కరోజే భారీగా పతనమైంది. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (AFP)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 58,750గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,8750గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 64,090గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,40,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,409గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,240గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 64,090గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,400గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,800గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,090గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,800గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 64,140గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,360గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1400 తగ్గి రూ. 73,600గా కొనసాగుతోంది. శనివారం ఈ ధర రూ. 75,000గా ఉండేది.

Silver rate today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,600.. బెంగళూరులో రూ. 72,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 23,570గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,570గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం