Gold and Silver prices today : మరింత పెరిగిన బంగారం ధర- హైదరాబాద్​లో రూ. లక్ష దాటేసిన వెండి రేటు!-gold and silver prices today 28th septemeber 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పెరిగిన బంగారం ధర- హైదరాబాద్​లో రూ. లక్ష దాటేసిన వెండి రేటు!

Gold and Silver prices today : మరింత పెరిగిన బంగారం ధర- హైదరాబాద్​లో రూ. లక్ష దాటేసిన వెండి రేటు!

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​ టైమ్​ హై వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మీ నగరాల్లో పసిడి, వెండితో పాటు ప్లాటీనం రేట్లను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 77,460కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 77,450గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,74,600గా ఉంది.

10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర సైతం రూ. 10 పెరిగి.. రూ. 71,010కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 71,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,10,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,101గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,460గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,010గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,460గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 71,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,460గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,460గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,060గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 77,510గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,460గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 96,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 96,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,02,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 96,100.. బెంగళూరులో రూ. 89,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 120 పెరిగి.. రూ 26,860కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,740గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం