Gold and silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold and silver prices today 27 feb 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 27 Feb 2024 In Telugu States

Gold and silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Feb 27, 2024 05:30 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. వెండి ధరలు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా...
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా...

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,590కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 57,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,75,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,759గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 62,830కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,840గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,28,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,283గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,830గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,830గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,880గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,440గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 74,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 74,500గా ఉండేది.

Silver rates today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,400.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 160 తగ్గి.. రూ. 23,790కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,950గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,790గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం