ఏప్రిల్​ 26 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 26th april 2025 in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 26 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

ఏప్రిల్​ 26 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓ బంగారు దుకాణంలో ఆభరణం.. (PTI)

దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర స్థిరంగా రూ. 98,353గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,83,530గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,835గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 90,213గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,02,130గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,021గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,065 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,255గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,213గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,353గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,061గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,251గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,067గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,257గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,069గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,259గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,075గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,265గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,121గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,311గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,250గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ వ్యవహారం, ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్థిరంగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,390గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,03,900కి చేరింది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,100 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,14,900.. బెంగళూరులో రూ. 1,02,900గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం