Gold and silver prices today : గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!-gold and silver prices today 26 feb 2024 in hyderabad delhi and chennai ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 26 Feb 2024 In Hyderabad Delhi And Chennai

Gold and silver prices today : గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!

Sharath Chitturi HT Telugu
Feb 26, 2024 09:17 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. వెండి ధరలు కూడా సోమవారం దిగొచ్చాయి. ఆ వివరాలు..

గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!
గుడ్​ న్యూస్​.. పెళ్లిళ్ల సీజన్​లో దిగొస్తున్న పసిడి ధర!

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,690కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 57,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,76,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,769గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 62,940కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,29,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,294గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,090గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,940గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,480గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,940గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,940గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,990గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,940గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 74,800కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 74,900గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 71,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం