కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగిపోయిన బంగారం ధరలు, కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 89,635కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 8,96,350గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,963గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 82,165కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 8,21,650కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,216గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,313గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,783గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,165 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 89,635గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,161గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,631గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 82,155గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 89,625గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,169గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,639గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,175గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,645గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,221గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 89,691గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 823,160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,630గా ఉంది.
ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,480గా ఉంది. ఇక కేజీ వెండి రూ. రూ. 1,04,800కి చేరింది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,13,200 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,14,000గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ.1,04,800.. బెంగళూరులో రూ. 1,03,000గా ఉంది.
సంబంధిత కథనం