Gold and silver prices today : రూ. 68వేలు దాటేసిన పసిడి ధర- ఇంకెంత పెరుగుతుంది?-gold and silver prices today 20th april 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 68వేలు దాటేసిన పసిడి ధర- ఇంకెంత పెరుగుతుంది?

Gold and silver prices today : రూ. 68వేలు దాటేసిన పసిడి ధర- ఇంకెంత పెరుగుతుంది?

Sharath Chitturi HT Telugu
Apr 20, 2024 05:46 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు రూ. 68వేలు దాటేశాయి! వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి.

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు రికార్డు స్థాయిని తాకుతూనే ఉన్నాయి. బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 68,160కి చేరింది. శుకరవారం ఈ ధర రూ. 68,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,81,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,816గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 74,350కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 74,340గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,43,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,310గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,350గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,910గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,170గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,350గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,160గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,350గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,210గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,400గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,350గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 86,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 86,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,400.. బెంగళూరులో రూ. 85,900గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం