Gold and silver prices today : పసిడి భగభగ! రూ. 64వేలకు చేరువలో బంగారం ధర..-gold and silver prices today 2 april 2024 hyderabad vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 2 April 2024 Hyderabad Vijayawada

Gold and silver prices today : పసిడి భగభగ! రూ. 64వేలకు చేరువలో బంగారం ధర..

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 05:47 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధిచెందాయి. ప్లాటీనం రేట్లు సైతం పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 63,610కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 63,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,36,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,361గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 69,390కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 69,380గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,93,900గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,540గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,610 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 69,390గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,560గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,430గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 63,610గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 69,390గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,610గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,390గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,660గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 69,440గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63,610గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,440గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,870గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 78,700కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 78,600గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,700.. బెంగళూరులో రూ. 77,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 పెరిగి.. రూ 24,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,330గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం