జులై 1 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? ఇక్కడ తెలుసుకోండి..-gold and silver prices today 1st july 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జులై 1 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? ఇక్కడ తెలుసుకోండి..

జులై 1 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? ఇక్కడ తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu

జులై 1, మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? వెండి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, విజయవాడతో పాటు వివిధ నగరాల్లో రేట్లను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (PTI)

దేశంలో బంగారం ధరలు జులై 1, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 97,583గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,758గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 89,463కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,946గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు రూ. 98వేల మార్క్​ దిగువకు చేరుకున్నాయి.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,315 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,435గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,431గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,305గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,425గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,319గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,439గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,325గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,435గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,327- రూ. 97,447గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,371గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,491గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,310గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,430గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,080గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,800కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,20,900 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,21,700గా ఉంది. విశాఖపట్నంలో 1,19,300గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం