Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం మరింత పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 78,990కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 78,980గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,89,900గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 72,410కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 72,400గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,24,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,241గా కొనసాగుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,560గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,140గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,410 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 78,990గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,410గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,990గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 72,410గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 78,990గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,410గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,990గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,460గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 79,040గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,410గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,990గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,910గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 99,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 99,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,05,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 99,100.. బెంగళూరులో రూ. 85,900గా ఉంది.
సంబంధిత కథనం