Gold and silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..-gold and silver prices today 16th june 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu
Jun 16, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం మారలేదు. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,65,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,650గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,550గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,25,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,255గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,550గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,150గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,550గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,550గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,600గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,550గా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today : దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,100గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 91,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,000.. బెంగళూరులో రూ. 90,300గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 160 పెరిగి రూ. 25,730కి చేరింది. శనివారం ఈ ధర రూ. 25,570గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,730గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం