Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 65,890కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,58,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,589గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 71,880కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,890గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,18,800గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,188గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,030గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,890 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 71,880గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,540గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 65,890గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,880గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,880గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,940గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,930గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,890గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,880గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Silver prices today in Hyderabad : దేశంలో వెండి ధరలు శనివారం పడ్డాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెడి రూ. 9,040గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి రూ. 90,400కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 90,500గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 94,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 90,400.. బెంగళూరులో రూ. 90,300గా ఉంది.
సంబంధిత కథనం