Gold and Silver prices today : ఫిబ్రవరి 14 : తగ్గేదే! అంటున్న బంగారం ధరలు- నేటి లెక్కలు ఇలా..-gold and silver prices today 14th feb 2025 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : ఫిబ్రవరి 14 : తగ్గేదే! అంటున్న బంగారం ధరలు- నేటి లెక్కలు ఇలా..

Gold and Silver prices today : ఫిబ్రవరి 14 : తగ్గేదే! అంటున్న బంగారం ధరలు- నేటి లెక్కలు ఇలా..

Sharath Chitturi HT Telugu
Published Feb 14, 2025 07:18 AM IST

Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శుక్రవారం సైతం బంగారం ధరలు పెరిగాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు.. (AFP)

దేశంలో బంగారం ధరలు రోజురోజుకు ఆల్​-టైమ్​ హై మార్క్​ని తాకుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 87,060కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 87,050గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,70,600గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 79,810కి చేరింది. గురువారం ఈ ధర రూ. 79,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,98,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,981గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 87,060గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,810గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,060గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 79,810గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 87,060గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,060గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 79,860గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 87,110గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 79,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,060గా ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ టారీఫ్​ హెచ్చరికలు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,940గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 99,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 99,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,06,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 99,400.. బెంగళూరులో రూ. 99,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం