Gold and silver prices today : భయపెడుతున్న పసిడి ధర! తొలిసారి రూ. 67వేల ఎగువకు.. వెండి రేటు @90వేలు-gold and silver prices today 13th april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : భయపెడుతున్న పసిడి ధర! తొలిసారి రూ. 67వేల ఎగువకు.. వెండి రేటు @90వేలు

Gold and silver prices today : భయపెడుతున్న పసిడి ధర! తొలిసారి రూ. 67వేల ఎగువకు.. వెండి రేటు @90వేలు

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 05:38 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​-టైమ్​ హైని తాకుతూనే ఉన్నాయి. శనివారం కూడా పెరిగాయి. మీ నగరాల్లో పసిడి, వెండి ధరలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,210కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,72,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,721గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 73,320కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,310గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,33,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,360గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,210 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,320గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,060గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,250గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,210గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,320గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,210గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,320గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,260గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,370గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,320గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,660గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 86,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 90,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,600.. బెంగళూరులో రూ. 84,150గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 570 పెరిగి.. రూ 26,430కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,860గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,430గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం