Gold and silver prices today : హైదరాబాద్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పడ్డాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 60,740గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,07,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,074గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 66,260 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,62,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,626గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,410గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 66,260గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 60,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,260గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,260గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,550గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 75,500గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 75,600గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 75,500.. బెంగళూరులో రూ. 74,800గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 24,310గా ఉందే. సోమవారం కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,310గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం