Gold and silver prices today : ఆగస్ట్ 12 : మరింత దిగొచ్చిన పసిడి ధర- వెండి కూడా..
Gold and silver prices today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 64,440కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 64,450గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,44,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,444గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 70,300గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 70,3100గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,03,100గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,031గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,590గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,450గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,440 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 70,300గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,440గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,300గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 64,440గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 70,300గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,440గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,300గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,490గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 70,350గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64,440గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,300గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 83,000గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 83,100గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 88,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 83,000.. బెంగళూరులో రూ. 80,550గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 24,910గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,910గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం