Gold and silver prices today : పసిడి భగభగ! రూ. 66వేల ఎగువకు బంగారం ధర..-gold and silver prices today 12th april 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : పసిడి భగభగ! రూ. 66వేల ఎగువకు బంగారం ధర..

Gold and silver prices today : పసిడి భగభగ! రూ. 66వేల ఎగువకు బంగారం ధర..

Sharath Chitturi HT Telugu
Apr 12, 2024 05:37 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా దిగొచ్చింది. ప్లాటీనం రేటు కూడా పడింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,210కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,62,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,621గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 72,230కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,220గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,22,300గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,360గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,380గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,210 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,230గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,260గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,210గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,230గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,210గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,230గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,260గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,280గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,230గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,490గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84,900కి చేరింది. గురువారం ఈ ధర రూ. 85,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,900.. బెంగళూరులో రూ. 84,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 230 తగ్గి.. రూ 25,860కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,090గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం