Gold and silver prices today : జూన్​ 11 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 11th june 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జూన్​ 11 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : జూన్​ 11 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu
Jun 11, 2024 05:56 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 65,690గా ఉంది. సోమవారం సైతం ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,56,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,569గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 71,660 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజూ ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,16,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,166గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,81గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,660గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,660గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,660గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,171గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,660గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి రేటు టుడే..

Silver price today : దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,180గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 91,800గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 91,700గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 96,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,800.. బెంగళూరులో రూ. 90,300గా ఉంది.

ప్లాటీనం రేటు ఈరోజు..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 25,980గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,980గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం